నేను ఎవరికీ భయపడను… ఇలాగే ఉంటా
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీభవన్‌లో జరిగిన క్రమశిక్షణా కమిటీ సమావేశంలో తీవ్రస్థాయిలో స్పందించారు. “నేను బలహీనుడినా, బలవంతుడినా అనేది అందరికీ తెలుసు. నన్ను రెచ్చగొట్టొద్దు,” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్‌లో తనకున్న గౌరవాన్ని, నిబద్ధతను తెలియజేస్తూ, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనే తపన తనలో ఉందన్నారు. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గాలలో నడుస్తున్న అంతర్గత పోరుతో సంబంధించి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిలపై ఫిర్యాదు చేస్తూ ఆయన 15 పేజీల నివేదికను క్రమశిక్షణా కమిటీకి సమర్పించారు. బీసీలకు గౌరవం ఇవ్వాలని కోరుతూ, పార్టీ లోపాలపై స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. తనపై వ్యక్తిగత దూషణలు జరుగుతున్నా కూడా పార్టీకి తనకున్న గౌరవాన్ని కోల్పోకుండా, బాధ్యతతో వ్యవహరిస్తున్న తన స్థైర్యాన్ని ఈ ప్రసంగం ద్వారా స్పష్టంగా చాటారు.