స్నాచర్లతో హైదరాబాద్ పరేషాన్..
హైదరాబాద్‌లో స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రెండు గంటల వ్యవధిలో ఆరు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. బైక్‌లపై వచ్చి మహిళల మెడలో గొలుసులు లాక్కొని పరారయ్యారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వరకు ఆరు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. దుండగులు మాస్క్‌లు ధరించి స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని, ఈ ఆరు చోట్ల ఒకే ముఠా కావొచ్చని చెప్పారు. దొంగలను పట్టుకోవడానికి 12 బృందాలు గాలిస్తున్నారన్నారు. ఉప్పల్‌లోని రాజధాని కాలనీలో ఉదయం 6:20 నిమిషాలకు మొదటి స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. తర్వాత కల్యాణ్ పురిలో ఉదయం 6:40 నిమిషాలకు రెండో ఘటన, నాచారంలోని నాగేంద్రన్ కాలనీలో ఉదయం 7:10 నిమిషాలకు మూడో ఘటన, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్‌లో ఉదయం 7:40 నిమిషాలకు నాలుగో ఘటన, చిలకలగూడ రామాలయం వీధిలో ఉదయం 8 గంటలకు ఐదో ఘటన, రాంగోపాల్‌పేట్ పరిధిలో ఉదయం 8:10 నిమిషాలకు ఆరో ఘటన జరిగింది.