పవర్ లిఫ్టింగ్‌లో రబ్బానీకి పసిడి
పవర్ లిఫ్టింగ్ పోటిల్లో హైదరాబాద్ యువకుడు సత్తా చాటాడు. అంతర్జాతీయ పవర్ లిప్టింగ్ పోటిల్లో పాల్గొన్న మహమ్మద్ రబ్బానీ 53 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫతేనగర్ వ్యాయామశాల ఆడీటోరియంలో జరగనున్న దక్షిణ భారత సబ్ జూనియర్ , సీనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాపింయన్‌షిప్‌కు మహమ్మద్ రబ్బానీ ఎంపికయ్యాడు.

జాతీయ స్థాయిలో టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటి ఈ పతకాన్ని సాధించాడు. అంతేకాక అతను స్వ్కాట్‌లో 165 కిలోలు , బెంచ్ ప్రెస్‌లో 77.5 కిలోలు , డెడ్‌లిఫ్ట్‌లో 187.5 కిలోలు బరువులను ఎత్తాడు.

