మరో హైదరాబాద్ IIT విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. మేఘ కపూర్ అనే విద్యార్థి మూడు నెలల ముందే ఐఐటీ హైదరాబాద్‌లో తన బిటెక్ పూర్తిచేశాడు. ఈ క్రమంలోనే తన పై చదువుల కోసం సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో దిగాడు. అక్కడే ఉంటూ తన ఎంటెక్‌కు శిక్షను తీసుకుంటున్నాడు. కానీ ఉన్నట్టుండి ఈరోజు ఉదయం లాడ్జి భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పాలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. అయితే మేఘ కపూర్ రాజస్థాన్‌కి చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. హైదరాబాద్ ఐఐటీకి సంబంధించిన ఒక విద్యార్థి మరణించి వారం కాకముందే… మళ్లీ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలుగుతోంది.

