గజ్వేల్‌కు కూడా హుజూరాబాద్ రిజల్టే
గజ్వేల్: గజ్వేల్‌లోనూ హుజూరాబాద్ ఫలితమే రిపీట్ కాబోతోందని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన గజ్వేల్‌లోని ఫంక్షన్ హాలులో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 30న జరిగే ఓటింగ్‌లో కమలం గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లు ఉత్సుకతతో ఉన్నారని చెప్పారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు చాలామందికి ఇంకా ఇప్పటికీ ప్యాకేజీ డబ్బులు వెయ్యలేదు. బీజేపీలో చేరితే ప్రభుత్వ పథకాలు, ప్యాకేజీలు ఆపేస్తామని బీఆర్ఎస్ నేతల బెదిరింపులు. ఈ నెల 7న గజ్వేల్‌లో నామినేషన్ వేస్తున్నానన్న ఈటల. ప్రజల సహకారం తమకు కావాలన్న ఈటల.