Home Page SliderTelangana

హుస్సేన్ సాగర్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ బోటులో బాణ సంచా పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు ఈ ఘటనలో గల్లంతైన బీటెక్ విద్యార్థి అజయ్ కోసం రెండో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారత మాతకు మహా హారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్ బాణసంచా కాల్చేటప్పుడు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. భారత మాతకు హారతి కార్యక్రమం కోసం పటాసులు కాల్చేందుకు గణపతి పలువురు యువకులతో పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.