ఆమె భర్త మాములోడు కాదు..
ఓ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యకు స్వేచ్ఛ ఇచ్చి ఆమె ప్రియుడితో వివాహం జరిపించాడు. ఈ వివాహానికి గ్రామస్తులు సాక్షిగా ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. సంత్ కబీర్‌నగర్‌లో ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2017లో కల్లు అనే వ్యక్తి రాధిక అనే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. అయితే రాధిక గతంలో ఓ యువకుడిని ప్రేమించింది. ఆ విషయం కాస్తా భర్తకు తెలిసింది. అయితే.. తన భార్య రాధిక ఎలాంటి వాదనలు లేకుండా ఆమె కోరిక మేరకు ఆమె జీవితాన్ని గడపడానికి అనుమతించాడు. అంతే కాకుండా తన 7 ఏళ్ల కుమారుడు ఆర్యన్ మరియు చిన్న కుమార్తెను పెంచే బాధ్యతను స్వయంగా తీసుకున్నాడు. తర్వాత కల్లు తన భార్యను ఆమె ప్రేమికుడితో గ్రామంలోని ఆలయంలో వివాహ వేడుకను ఘనంగా జరిపించాడు. కల్లు మరియు అతని పిల్లలు మాత్రమే ఈ వివాహానికి సాక్షులుగా మారారు.నిజానికి ఈ అపూర్వ వివాహానికి గ్రామం మొత్తం కూడా సాక్ష్యంగా నిలిచింది. భర్తే స్వయంగా భార్యను పంపించి వేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.