Home Page SliderTelangana

నడిరోడ్డుపై గర్భిణీ భార్యపై భర్త దాడి..

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై గర్భిణీ భార్యపై షాడిస్ట్ భర్త దాడి చేశాడు. 2024 అక్టోబర్‌లో బెంగాల్‌కు చెందిన షబానా పర్వీన్‌తో మహమ్మద్ బస్ రత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లోని హఫీజ్ పేట్ ఆదిత్యనగర్‌లో నివాసముంటున్నారు. మహమ్మద్ బస్ రత్ ఇంటీరియర్ పనులు చేస్తున్నాడు. రెండు నెలల గర్భంతో గత నెల 29న పర్వీన్ ఆసుపత్రిలో చేరింది. డిశ్చార్చ్ అయిన తర్వాత ఆసుపత్రి ముందు ఏదో కారణంతో భార్యా, భర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. భార్య పర్వీన్‌ను నడి రోడ్డుపై పడేసి బండరాయితో భర్త మహమ్మద్ బస్ రత్ దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి భర్తను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన పర్వీన్ ను చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పర్వీన్ కోమాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.