‘అమెరికాలో హెలీన్ హరికేన్ బీభత్సం’ …105 మంది దుర్మరణం
అమెరికాను హెలీన్ హరికేన్ కుదిపేస్తోంది. ఫ్లోరిడా, జార్జియా వంటి రాష్ట్రాలలో బీభత్సం సృష్టిస్తోంది. హెలీన్ హరికేన్ ప్రభావంతో లక్షల మంది వరద నీటిలో చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఈ హరికేన్ ప్రభావం వల్ల 105 మంది దుర్మరణం పాలయ్యారు. నార్త్ కొరోలినాలో 30 మంది మరణించారని సమాచారం రాగా, అన్ని రాష్ట్రాలలో కలిపి ఒక్కరోజులోనే అది 91 మందికి చేరింది. ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరొలినా, వర్జీనియా,టెన్నెస్సీ రాష్ట్రాలలో కూడా మరణాలు నమోదయ్యాయి. తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు నీరు, ఆహారం చేర్చడం సవాలుగా మారిందని అధికారులు తెలియజేస్తున్నారు. ఫ్లోరిడాలోని బిగ్ బెండ్ వద్ద గంటకు 225 కిలోమీటర్ల వేగంతో హరికేన్ తీరం దాటింది. దీనిలో పలుచోట్ల కుంభవృష్టి వానలు పడుతున్నాయి. ఇళ్లు, వాణిజ్య సముదాయాలు నీట మునగగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.