రావి చెట్టుపై వందలాది చిలుకలు..
మహబూబ్‌నగర్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోని ఈ రావిచెట్టు వందలాది చిలుకలకు నివాసంగా మారింది. సాయంత్రం అయ్యేసరికి చాలు గుంపులు గుంపులుగా చిలుకలు వచ్చి ఈ రావిచెట్టుపై వాలిపోతుంటాయి. వేసవి కాలం కావడంతో ఈ చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి. చెట్టుపైకి చేరిన ఆకుపచ్చ చిలుకలే కొత్త చిగుళ్ల మాదిరిగా కనువిందు చేస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఆకులో, చిలుకలో తెలియని పరిస్థితిలో ప్రయాణికులకు కనువిందు చేస్తున్నాయి.

