Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు

కిశోర బాలిక‌ల అక్ర‌మ‌ర‌వాణాకు పాల్ప‌డుతున్న ముఠా గుట్టును విశాఖ పోలీసులు ర‌ట్టు చేశారు. నేపాల్,జార్ఖండ్,ఒడిషా స‌రిహ‌ద్దుల నుంచి కిశోర బాలిక‌ల‌ను కిడ్నాప్ చేసి వారిని బ‌ల‌వంతంగా ర‌వాణాకు ఒప్పించి త‌ర‌లిస్తున్నారు. ఈ భాగోతం కిరండోల్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమ రవాణా చేస్తుండ‌గా వెలుగు చూసింది.రైల్వేస్టేషన్‌లో బాలికల అక్రమంగా త‌ర‌లించేందుకు సిద్దంగా ఉన్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.నిందితులపై అనుమానం వ‌చ్చి విచారించ‌గా బాలిక‌ల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న‌ట్లు అంగీక‌రించారు.రైల్వే పోలీసులు 11 మంది బాలిక‌ల‌ని రెస్క్యూ చేసి కాపాడారు. నిందితుడు రవికుమార్ బిసోయ్
నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికల అక్రమంగా ర‌వాణా చేస్తున్న‌ట్లు ప్రాధ‌మిక విచార‌ణ‌లో వెల్ల‌డైంది.11 మంది బాలిక‌లు ఒడిశా నవరంగపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు.ఇప్ప‌టి వ‌ర‌కు 100 మందికి పైగా బాలిక‌ల‌ను అక్ర‌మంగా త‌ర‌లించిన‌ట్లు నిందితులు అంగీక‌రించిన‌ట్లు పోలీసులు తెలిపారు.