మెడికల్ కాలేజీల భారీ స్కామ్- ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తెలంగాణలోని పలు మెడికల్ కాలేజీలలో జరిగిన అవకతవకలపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పీజీ మెడికల్ సీట్ల కేటాయింపు విషయంలో స్కామ్ జరిగిందని కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న ఈడీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కన్సల్టెంట్లు, మధ్యవర్తులతో కలిసి పీజీ సీట్లు బ్లాక్ చేసినట్లు గుర్తించారు. మామూలు రుసుము కంటే మూడు రెట్లు అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. దీనితో పలు కాలేజీలకు సంబంధించిన మొత్తం రూ.9.71 కోట్లు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, చల్మెడ ఆనందరావు కాలేజి, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.