సింధునదిలో భారీగా బంగారు నిల్వలు..ఎగబడ్డ ప్రజలు
పాకిస్తాన్‌లోని సింధునదిలో భారీగా బంగారు నిల్వలు బయటపడ్డాయనే సంగతి గుప్పుమంది. అటోక్ జిల్లాలోని సింధు నదిలో 32 కిలోమీటర్ల పరిధిలో టన్నుల కొద్దీ బంగారు నిల్వలు విస్తరించి ఉన్నాయని, వాటిని వెలికితీసే ప్రక్రియ ప్రారంభించాలని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. నిత్యావసరాలు కూడా దొరకక, వరుస ఉగ్రదాడులతో బెంబేలెత్తుతున్న పాక్ ప్రజలు భారీగా నది వద్ద ఎగబడ్డారు. వెలికితీత ప్రక్రియను మొదలుపెడితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బాగుపడి, దేశంపై ఉన్న అప్పుల భారం తగ్గుతుందని, పాక్ కరెన్సీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నారు.

