Andhra PradeshHome Page Slider

300 కార్లతో భారీ ర్యాలీ- తెలుగుదేశం పార్టీలో చేరికలు

నెల్లూరు నుండి మంగళగిరి వరకూ దాదాపు 300 కార్లతో భారీ ర్యాలీగా వెళ్లి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు కోటం రెడ్డి గిరిధర్‌రెడ్డి. వైసీపీ రెబల్ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడే ఈ గిరిధర్‌రెడ్డి. నెల్లూరులోని కస్తూరి గార్డెన్స్ నుండి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ర్యాలీ ప్రారంభంలో మహిళలు ఆయనకు గుమ్మడికాయలతో హారతులిచ్చి సాగనంపారు. గిరిధర్‌రెడ్డితో పాటు పలువురు స్థానికనాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి పసుపు కండువాలు కప్పుకోబోతున్నట్లు సమాచారం.