Home Page SliderNational

భారీ ఆన్‌లైన్ స్కామ్..ఎన్నివేల కోట్లంటే?

అస్సాంలో భారీ ఆన్‌లైన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో ఏకంగా రూ.22 వేల కోట్లు మోసం గుట్టురట్టయింది. ఇలాంటి మోసపూరిత పెట్టుబడులకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రజలను హెచ్చరించారు. ఒకటికి పదిరెట్లు లాభం వస్తుందంటూ మనుషుల్ని మభ్యపెట్టి నిలువునా దోచేస్తున్నారు. పెట్టుబడిని స్టాక్ మార్కెట్లో రెట్టింపు చేస్తామంటూ, ఇన్వెస్టర్ల పేరుతో మోసగాళ్లు సొమ్మును సేకరించారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరిని అరెస్టు చేశారు.