Breaking NewscrimeHome Page SliderTelangana

అంబ‌ర్‌పేట్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ సామగ్రి ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీ ఎత్తున‌ ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళ‌న‌ల‌కు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.గంట‌ల త‌ర‌బ‌డి అగ్ని కీల‌లు ఆకాశానికి ఎగ‌సిప‌డ్డాయి.అగ్నికీల‌ల‌ను నిలువ‌రించేందుకు నాలుగు ఫైరింజ‌న్ల‌ను రంగంలోకి దించారు.దాదాపు 5 కి.మీ.మేర ద‌ట్టమైన పొగ అల‌ముకోవ‌డంతో వాహ‌న‌దారులు,ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు.