హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ షేక్‌పేట్ డీమార్ట్ పక్కన జూహీ ఫెర్టిలిటీ సెంటర్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.దీంతో భవనంతో పాటు పక్కనే ఉన్న ఆకాశ్ స్టడీ సెంటర్‌కి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అదే బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని రిలయన్స్ ట్రెండ్స్ వైపునా మంటలు వ్యాపించాయి.భవన సముదాయాల్లో ఉన్న ప్రజలు,చుట్టు పక్కల వారు అగ్ని ప్రమాదం ధాటికి భీతిల్లిపోయారు.ఉరుకులు పరుగులతో భవనాల నుంచి కిందకు దిగారు.చాలా మంది భవనం పై నుంచి దూకారు.పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అగ్నికీలలను నిలువరించే ప్రయత్నం చేశారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.