పాకిస్తాన్ లో భారీ పేలుడు.. 20 మంది మృతి
పాకిస్తాన్ క్వెట్టా రైల్వే స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నారు. పెషావర్ వెళ్లాల్సిన జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు కోసం ప్రయాణీకులు ప్లాట్ ఫాం పై వేచి ఉండగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి శరీర భాగాలు ముక్కలయ్యాయి. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

