Home Page SliderNationalNews Alert

భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు మృతి..

జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పులతో గడగడలాడింది. సరిహద్దు వద్ద పూంచ్ జిల్లాలోని క్రిష్ణఘాటి సెక్టార్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు పాకిస్తాన్ ఆర్మీ జవాన్లుగా గుర్తించారు. పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించడంతో సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పులలో ఏడుగురు మృతి చెందారు. ఫిబ్రవరి 5నే కాశ్మీర్ రిబరేషన్ డేను పాకిస్తాన్ జరుపుకోవడం గమనార్హం.