crimeHome Page SliderNational

భారీ ఎన్‌కౌంటర్..8 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మరణించారని అధికారులు వెల్లడించారు. బీజాపూర్ జిల్లా గంగలూర్‌ అటవీ ప్రాంతంలో నేటి ఉదయం నుండి భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అడవులలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.