Home Page SliderTelangana

ఈడీ విచారణ ఎలా జరుగుతుంది?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. ఇప్పటి ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా, రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్నారు. రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్‌లో మొత్తం 9 మందిని ఈడీ విచారిస్తోంది. మనీష్ సిసోడియా, కవిత, అరుణ్ రామచంద్ర పిళ్లై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, అరవింద్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్‌ను ఈడీ ప్రశ్నించనుంది. ఎమ్మెల్సీ కవితను మాత్రమే ఈడీ అధికారులు లోపలకి అనుమతించారు. భర్త అనిల్‌తోపాటు లాయర్లను అధికారులు అడ్డుకున్నారు. ఈడీ విచారణకు వెళ్తూ కవిత పిడికిలి బిగించి కార్యకర్తలకు అభివాదం చేశారు.

కవిత విచారణ ఎలా జరుగుతుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ ఇప్పటికే కవిత నుంచి రాబట్టాల్సిన అంశాలకు సంబంధించి ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ పాత్ర, నిందితులతో ఉన్న పరిచయాలపై ఈడీ ప్రశ్నించనుంది. ఇప్పటికే విచారణలో ఈడీ కీలక విషయాలను రాబట్టింది. తాజాగా కవిత నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని ఈడీ భావిస్తోంది. కవిత విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలను సైతం మోహరించారు.