క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించుకునేదెలా?
మన దేశంలో ప్రతీ పదిమందిలో ఒకరికి వాళ్ల జీవితకాలంలో క్యాన్సర్ రిస్క్ ఉందని నేషనల్ క్యాన్సర్ ప్రోగ్రాం రిజిస్ట్రీ తెలియజేస్తోంది. క్యాన్సర్ ఏ రూపంలో అయినా కాటువేసే ప్రమాదం ఉంది. పూర్తిగా ఇది రాకుండా నివారించలేము కానీ, క్యాన్సర్ వచ్చే రిస్కును తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది.

రకరకాల క్యాన్సర్ బారి నుండి రక్షణ పొందడానికి కొన్ని మార్గాలు అవలంభించాలి.
ఎండలో ఎక్కువగా తిరిగేవారికి స్కిన్ క్యాన్సర్ రిస్క్ ఉంది. వీరు సన్ స్క్రీన్ లోషన్‌ను వాడడం ద్వారా కానీ, ఎండకు ఎక్కువగా గురికాకుండా తగిన రక్షణ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. ఆల్ట్రావయలెట్ రేస్ శరీరంపై పడకుండా చూసుకోవాలి.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. స్టీల్ లేదా రాగి బాటిల్స్‌ను వాడడం మంచిది.
కాఫీ, టీలను మితంగా తీసుకుంటే వాటిలో ఉండే కెఫిన్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ తగ్గుతాయి.
ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే వాటిలో ఉండే క్లోరోఫిల్ వల్ల మెగ్నీషియం లభిస్తుంది. ఇది కోలన్ క్యాన్సర్‌ను దరిచేరకుండా చేస్తుంది.
ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం తినే ఆహారం, గాలి స్వచ్చంగా ఉంటాయి. దీనితో లంగ్స్ క్యాన్సర్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
వీలైనంత వరకూ రసాయనాలు లేని కూరలు, పండ్లు తినడం మంచిది.
రోజూ వ్యాయామానికి కనీసం అరగంట సమయం కేటాయించాలి. మానసిక ఒత్తిడిని దూరం చేసే ధ్యానం, మెడిటేషన్, యోగా అలవాటు చేసుకోవాలి. వీటి ద్వారా చాలావరకూ క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు.

