క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇలా పెంచుకోండి
ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. చాలామంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే ప్రతి క్రెడిట్ కార్డుకి కొంత లిమిట్ ఉంటుంది. క్రెడిట్ లిమిట్ అనేది క్రెడిట్ స్కోర్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి క్రెడిట్ లిమిట్ సరిపోకపోతే క్రెడిట్ యూజర్లు ఇబ్బంది పడుతుంటారు. ఇలా క్రెడిట్ లిమిట్ ను పెంచుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు వాళ్ల లిమిట్ ను పూర్తిగా వాడుకుంటే సిబిల్ స్కోరు తగ్గుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ కోసం కార్డు లిమిట్ లో 30 శాతానికి మించి వాడకూడదు. అందుకే కార్డ్ లిమిట్ పెంచుకుంటే మనం వాడగలిగే మొత్తం పెరుగుతుంది.
. క్రెడిట్ లిమిట్ క్రెడిట్ స్కోరు పెరిగితే పెరుగుతుంది. ఈఎంఐలు రెగ్యులర్ గా కడుతూ ఉంటే బ్యాంకులు ఆటోమేటిక్ గా క్రెడిట్ లిమిట్ పెంచుతాయి.
. అలాగే క్రెడిట్ కార్డు లిమిట్ లో 30 శాతం మించకుండా వాడుకుంటే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరుగుతుంది.
. జీతం పెరిగితే క్రెడిట్ కార్డు లిమిట్ కూడా పెరుగుతుంది. అందుకే లిమిట్ పెంచుకోవాలనుకునే వారు ఆదాయం పెరిగే మార్గాలు చూసుకోవాలి.