HealthLifestyle

గుడ్లు ఉడకబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో!…

సాధారణంగా ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతుంటారు. కానీ గుడ్లు ఉడకబెట్టిన తరువాత మనం పారబోసే నీరు కూడా మనకి ఉపయోగపడుతుందని తెలుసా మీకు?
ఈ రోజుల్లో జుట్టు రాలుట చాల పెద్ద సమస్య అయిపోయింది. దానికోసం తలకి ఏదేదో అప్లై చేస్తుంటాం. జుట్టు రాలకుండా ఉండడానికి ఈ హోమ్ రెమెడీ బాగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు.వీటిలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం బాగా ఉంటాయి.కాబట్టి గుడ్లు ఉడకబెట్టిన నీటిని తలకు పట్టించి ముప్పై నిమిషాల తరువాత తలస్నానం చేస్తే కుదుళ్ళు బలపడి జుట్టు రాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి.
ఈ నీటిని చల్లారిన తరువాత మట్టిలో పోస్తే నేల సారవంతమవుతుంది. అంతేకాదండోయ్, ఈ నీరు వంటిల్లు శుభ్రం చేసుకోవడంలోనూ బాగా సహాయపడుతుంది. అది ఎలా అంటే,వంటింట్లో జిడ్డు పేరుకున్న గట్టు మరియు గోడలను ఈ నీటితో శుభ్రం చేస్తే మకిలి త్వరగా వదులుతుంది.