HealthHome Page SliderLifestyle

వీటిని రోజూ నానబెట్టుకొని తింటే ఎన్ని ప్రయోజనాలో…!

డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరికీ తెలుసు. వాటిలో ముఖ్యమైనది అంజీర్. ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర్ తింటే చాలా ఉపయోగాలున్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంజీర్ చాలా రుచికరంగా ఉంటాయి. దీనిలో పొటాషియం, విటమిన్ K, B6, రాగి, ఫైబర్, మెగ్నీషియం, మొదలైనటువంటి పోషకాలు ఉంటాయి. వీటివల్ల ఎముకలు ధృడంగా ఉండడమే కాకుండా కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతే కాదండోయ్, దీనివల్ల జీవక్రియ పెరుగుతుంది మరియు బరువు నియంత్రణలో కూడా ఉంటుంది. వీటిని తినడం వలన మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు వీటిని తీసుకుంటే మంచిది. కాకపోతే వీటిని ప్రతిరోజు కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.