Home Page SliderNationalPolitics

‘వారి విషయంలో నిర్ణయం ఎంతకాలం’..సుప్రీం అసహనం

తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలంటూ సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.  వారిపై అనర్హత వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం విచారించింది.  తెలంగాణ హైకోర్టు గత ఏడాది మార్చిలో నాలుగు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పినా ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చామంటూ కాంగ్రెస్ పార్టీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. స్పీకర్‌కు తగిన సమయం కావాలని అడుగగా, ఎంతకాలం కావాలో స్పీకర్‌ను కనుక్కుని చెప్పాలని జస్టిస్ ఆదేశించారు. విచారణను వారం రోజులు వాయిదా వేశారు.