Home Page SliderNationalPolitics

‘ఇంటిదొంగలను కనిపెట్టాలి’..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తమ పార్టీ నేతలు, కార్యకర్తలపైనే  కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటి దొంగలను కనిపెట్టాల్సిన అవసరం ఉందని గుజరాత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ బాధ్యతలు నెరవేర్చేవరకూ రాష్ట్ర ప్రజలు తమకు ఓటు వేయరని పేర్కొన్నారు. గుజరాత్‌లో మూడు దశాబ్దాలుగా బీజేపీ పాలన విఫలమయ్యిందన్నారు. గుజరాత్ ప్రజలు కొత్త విజన్ కోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలలో నిజాయితీగా పనిచేస్తూ, పార్టీ సిద్ధాంతాన్ని గుండెల్లో పెట్టుకునేవారున్నారు. వారితో పాటు, ప్రజలతో, పార్టీతో సంబంధాలు కొనసాగించకుండా వారికి గౌరవం ఇవ్వని వారు కూడా ఉన్నారు. వారు బీజేపీతో సంబంధాలు కలిగి, వారి కోసం పనిచేస్తున్నారు. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.