రాజయ్యపేట డ్రగ్ పార్క్‌పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు
రాజయ్యపేట బల్క్‌డ్రగ్ పార్క్ అంశంపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే జరిగినదని ఆమె స్పష్టం చేశారు.
ఆమె మాట్లాడుతూ, “మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్ ఈరోజు రాజయ్యపేటకు వెళ్లారు. ఆ సమయంలో పాలాభిషేకాలు చేసినవారే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
అనిత మాట్లాడుతూ, “మెడికల్ కాలేజీల విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. 2014లోనే రాజయ్యపేట భూములకు ఎకరాకు ₹18 లక్షలు ఇచ్చాం. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి,” అని ఆమె పిలుపునిచ్చారు.