Home Page SliderInternational

NTR కు హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు – ఫ్యాన్స్ వార్‌కు తెరదించిన HCA

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను కూల్ చేస్తూ హాలీవుడ్ క్రిటిక్స్ శుభవార్త చెప్పింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రామ్‌చరణ్ -ఎన్టీఆర్ అభిమానుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. హాలీవుడ్‌లో రామ్‌చరణ్ మాత్రమే హల్‌చల్ చేయడం, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుకు హాజరవడం వంటి విషయాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్‌ను ఆహ్వానించలేదంటూ మండిపడ్డారు. దీనితో HCA బృందం స్పందించి, ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చింది.

ఎన్టీఆర్‌కు అవార్డులు కొత్త కాదని, ఆయనకు కూడా ఆహ్వానం పంపామని, కొత్త సినిమా షూటింగ్ కారణంగా వ్యక్తిగతంగా రాలేకపోయారని వివరణ చ్చింది. ఈ సినిమాకు గాను ఎన్టీఆర్‌కు, అలియాభట్‌కు కూడా అవార్డులు లభించాయని వారికి వాటిని పంపుతున్నామని చెప్తూ, స్పాట్‌లైట్ అవార్డు ఫొటోను షేర్ చేసింది. దీనిపై ఎన్టీఆర్ పేరు కూడా ఉంది.   RRR సినిమాకు గాను కాలిఫోర్నియాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ అవార్డుల్లో ఏకంగా ఐదు విభాగాలలో అవార్డులు వచ్చాయి. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ మాత్రమే హాజరయ్యాడు.