Home Page SliderInternationalNational

మీ ఫోన్లు రికార్డ్ చేస్తున్నాం… బీ కేర్‌ఫుల్..

Share with

కేంబ్రిడ్జిలో కేంద్రంపై రాహుల్ నిప్పులు
ప్రతిపక్షాల ఫోన్లు రికార్డ్ చేస్తున్నారు
జాగ్రత్తగా ఉండాలని అధికారులే చెప్పారు
ప్రజాస్వామ్య దేశంలో అదే కరువైందన్న రాహుల్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఉపన్యాసం సందర్భంగా కేంద్రంపై దాడిని తీవ్రతరం చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రాథమిక నిర్మాణంపై దాడి జరిగుతోందని ఆరోపిస్తూ, ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ తన ఫోన్‌లోకి స్నూప్ చేయడానికి ఉపయోగించబడుతుందని ఆరోపించారు. తన కాల్‌లు రికార్డ్ అవుతున్నందున ఫోన్‌లో మాట్లాడేటప్పుడు “జాగ్రత్తగా” ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనను హెచ్చరించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ’21వ శతాబ్దంలో వినడం నేర్చుకోవడం’ అనే అంశంపై కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్‌లోని ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన ప్రసంగానికి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ సలహాదారు శామ్ పిట్రోడా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

“నా ఫోన్‌లో పెగాసస్ ఉంది. పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకుల ఫోన్‌లలో పెగాసస్ ఉంది. ఇంటెలిజెన్స్ అధికారులు నాకు కాల్ చేసారు, ‘దయచేసి మీరు ఫోన్‌లో ఏమి చెబుతున్నారో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మేము రికార్డ్ చేస్తున్నాం” అంటూ హెచ్చరించారు. ఇది నిరంతరం మాపై ఉన్న ఒత్తిడి అని చెప్పారు. ప్రతిపక్షంపై కేసులు పెడుతూనే ఉన్నారు. వ్యక్తిగతంగా నాపైనా… ఎన్నో క్రిమినల్ కేసులు పెడుతున్నారని… వాస్తవాని అవి క్రిమినల్ కేసులు కానేకావన్నారు. వాటిపైనే పోరాటం చేస్తు్న్నామంటూ తన స్పీచ్‌లో రాహుల్ గాంధీ గళం విప్పారు.

గత ఏడాది ఆగస్టులో, స్నూపింగ్ కోసం పెగాసస్‌ను ప్రభుత్వం ఉపయోగించుకుందనే ఆరోపణలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ, తాము పరిశీలించిన 29 మొబైల్ ఫోన్‌లలో స్పైవేర్ కనిపించలేదని, అయితే ఐదు మొబైల్ ఫోన్లలో మాల్వేర్ కనుగొనబడిందని నిర్ధారించింది. 29 ఫోన్లు ఇచ్చామని, ఐదు ఫోన్లలో కొన్ని మాల్వేర్‌లు కనిపించాయని, అయితే అది పెగాసస్ అని చెప్పలేమని టెక్నికల్ కమిటీ చెబుతోందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. కమిటీ నివేదికను చదివిన ధర్మాసనం, ‘టెక్నికల్ కమిటీ నివేదికపై ఆందోళన చెందుతున్నామంది. దేశంలో పార్లమెంటు, పత్రికలు, న్యాయవ్యవస్థపై ఆంక్షలు విధించారన్నారు రాహుల్ గాంధీ. “ప్రతి ఒక్కరికి తెలుసు… భారత ప్రజాస్వామ్యం ఒత్తిడిలో, దాడికి గురవుతుందన్నారు. నేను భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడినేమ రాహుల్… ప్రజాస్వామ్యానికి అవసరమైన సంస్థాగత చట్రం — పార్లమెంట్ , ఫ్రీ ప్రెస్, న్యాయవ్యవస్థ, కదలికలు, అన్నీ నిర్బంధంలో ఉన్నాయన్నారు. మొత్తంగా భారత ప్రజాస్వామ్యం ప్రాథమిక నిర్మాణంపై దాడిని ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. ప్రెజెంటేషన్ స్లైడ్‌లో తనను పోలీసు సిబ్బంది పట్టుకున్నట్లు కనిపిస్తున్న తన చిత్రాన్ని పంచుకున్న కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడటానికి పార్లమెంటు హౌస్ ముందు “కేవలం నిలబడి” ఆందోళన చేస్తున్నందుకు జైలు చేయబడ్డారన్నారు. కొన్నిసార్లు హింసాత్మకంగా కూడా మారాయన్నారు.

రాజ్యాంగంలో, భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా అభివర్ణించారు, ఆ యూనియన్‌కు చర్చలు, సంభాషణలు అవసరం. ఆ చర్చలే దాడి, బెదిరింపులకు గురవుతున్నాయన్నారు రాహుల్. పార్లమెంటు భవనం ముందు తీసిన చిత్రాన్ని చూడవచ్చు. ప్రతిపక్ష నాయకులు అక్కడే నిలబడి కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాం, మమ్మల్ని జైల్లో పెట్టారు. అలా 3,4 సార్లు జరిగింది. మాపై హింసాత్మకంగా వ్యవహిరిస్తున్నారు. మైనారిటీలు, మీడియాపై జరుగుతున్న దాడుల గురించి కూడా మీరు వినే ఉంటారు. ఇండియాలో ఏం జరుగుతుందో మీకు అర్ధమవుతుందంటూ గాంధీ ముగించారు.