హిటాచి ఏటిఎం ప్రారంభం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం మద్దిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన హిటాచి ఏటిఎంని గురువారం ప్రారంభించారు. హిటాచీ పేమెంట్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో సేవలు అందిస్తుంది.అలాంటి సంస్థ ప్రపధమంగా చిలకలూరిపేటలో తమ ఏటిఎం సేవలను ప్రారంభించింది.దీని ద్వారా క్యాష్ విత్‌డ్రాల్స్,డిపాజిట్స్ రెండూ చేసుకునే వెసులుబాటు ఉంది.సాధారణంగా నియోజకవర్గంలో చాలా మేజర్ గ్రామ పంచాయితీల్లో ఏటిఎం సేవలు అందుబాటులో లేవు.ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన బహుముఖ వాణిజ్య వేత్త, ఆరా గ్రూపు సంస్థల అధినేత ఆరా మస్తాన్ సంయుక్త సౌజన్యంతో తమ గ్రామ ప్రజలు ఏటిఎం అవసరాలు తీర్చేందుకు ఏటిఎంని ఏర్పాటు చేయించారు.మాతృమూర్తి,మాతృభూమి రుణం తీర్చుకోవాలన్న ఆరా మస్తాన్ సంకల్పంలో నుంచి ఆవిర్భవించిన ఈ ఏటిఎం సేవల స్వప్నం కార్యరూపం దాల్చింది. దీన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు.ముఖ్యఅతిథిగా మాజీ శాసన సభ్యులు,ప్రస్తుత శాసన మండలి సభ్యులు మర్రిరాజశేఖర్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏటిఏం సేవల శ్రీకారానినికి ఆరామస్తాన్ చొరవ చూపడం అభినందనీయమన్నారు.గ్రామం మనకు ఏం చేసింది అని ఆలోచించకుండా గ్రామానికి మన వంతు ఏ మేరకు సహకారం అందించాం అన్న లక్ష్యం,తపనతో ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఆయనలోని సేవా గుణానికి నిదర్శనమన్నారు. అనంతరం ఏటిఏంని పరిశీలించి దాని పనితీరుని అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆరా మస్తాన్ మాతృమూర్తి షేక్ మస్తాన్ బి , లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ , నిర్వాహకులు షేక్ అబ్దుల్ నబీ , ఆరా సుభాని , చాపలమడుగు రవి , బుడేసా , మహమ్మద్ హుస్సేన్ , బాలు , నాగూర్ తదితరులున్నారు.


 
							 
							