కర్రెగుట్టలో హై టెన్షన్..బేస్ క్యాంపుల ఏర్పాటు
కర్రెగుట్టల్లో 12వ రోజు ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ధోబే, నీలంసరాయి కొండల్లో బేస్ క్యాంప్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. కర్రెగుట్టలను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఆధునిక డ్రోన్లతో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ల కోసం ఇప్పటికే ప్రత్యేక సిగ్నలింగ్ టవర్ల ఏర్పాటు చేశారు. మావోయిస్టుల బంకర్లు గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. మరోపక్క ఈ ఆపరేషన్లతో అడవుల్లోకి వెళ్లేందుకు ఏజెన్సీ ప్రజలు భయపడుతున్నారు.

