ఇండియా కూటమి ర్యాలీలో హైటెన్షన్..నేతల అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలు సోమవారం ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో హై టెన్షన్ నెలకొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల గోల్‌మాల్ జరిగిందని దీనిపై సమాధానం చెప్పాలని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఓట్ చోరీపై విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ నిర్వహిస్తుండగా సంసద్ మార్గ్‌ను పోలీసులు బ్లాక్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కాగా.. తమతో భేటీకి 30మందికే అనుమతి ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ర్యాలీని పోలీసులు అడ్డుకుని పలువురు ఎంపీలను అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ, ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా.. విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్తున్న విపక్ష ఎంపీలను అడ్డుకున్న పోలీసులు.. వారిని ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు.