హైకోర్టు స్టే.. సుప్రీంకోర్టు వైపు రేవంత్ సర్కార్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.9పై హైకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, రేపే సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది. దీనికోసం ఢిల్లీలో న్యాయవాదులతో సమన్వయం చేసేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలను పంపే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ చీఫ్ మహేశ్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. హైకోర్టు తీర్పుతో ఎన్నికల ప్రక్రియపై ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన సుప్రీంకోర్టు వద్ద న్యాయపరమైన చర్యలకు దిగుతోంది.

