వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టే
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కార్యాలయాల కూల్చివేత విషయంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీనితో వీటిలో చట్ట పరమైన నిబంధనలు పాటించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రతినిధుల వాదనలు వినకుండా నిర్ణయాలు తీసుకోవద్దని పేర్కొంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని హైకోర్టు పేర్కొంది. ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిగణించాలని సూచించింది. అలాంటి పరిస్థితిలోనే కూల్చివేతపై ఆలోచనలు చేయాలని పేర్కొంది. హైకోర్టులో ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలు తమ కార్యాలయాలను కూల్చివేస్తున్నారంటూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.