Home Page SliderNews AlertTelangana

పబ్బులకు హైకోర్టు షాక్‌

తెలంగాణాలోని పబ్‌లకు హైకోర్టు షాకిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్‌ అనుమతి ఇచ్చేది లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. పబ్‌లపై గతంలో హైకోర్టు ఈ ఆదేశాలివ్వగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్‌ నిర్వాహకులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. న్యూఇయర్‌ సందర్భంగా నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపింది. రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్‌ సౌండ్‌ పెట్టరాదని పేర్కొంది. గత ఆదేశాల ప్రకారమే న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.