బాలుడి మృతి కేసులో GHMC నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్
అంబర్ పేట కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై GHMC పై హైకోర్టు మండిపడింది. అధికారుల తీరుపై ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారించింది. ఈ నెల 19 వ తేదీన అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి దుర్మరణం పొందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. ఈ ఘటనలో జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని జీహెచ్‌ఎంసీని ప్రశ్నించింది. తెలంగాణా సీఎస్, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, అంబర్‌పేట్ మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. మార్చి 16 నాటికి విచారణను వాయిదా వేసింది.