NewsNews AlertTelangana

బీజేపీ సభకు హైకోర్టు అనుమతి

వరంగల్‌లో బీజేపీ బహిరంగ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో బీజేపీ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు నిర్వాహకులకు ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ చెప్పారు. శనివారం నాటి సభ కోసం పార్టీ చెల్లించిన రూ.5 లక్షలు కూడా తిరిగి ఇచ్చేస్తామన్నారు. దీంతో సభకు అనుమతి కోరుతూ హైకోర్టులో బీజేపీ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న కోర్టు సభ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.