ఫుడ్ పాయిజన్ ఘటనపై మండిపడ్డ హైకోర్టు
తెలంగాణలో నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు మండిపడింది. ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూ అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే వారంలో మూడుసార్లు భోజనం వికటించడంపై ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఇది చాలా సీరియస్ అంశమని, పిల్లలు చనిపోతే కానీ, స్పందించరా అని మండిపడింది. ఒక వారంలో కౌంటర్ వేస్తామని చెప్పిన ప్రభుత్వ న్యాయవాదిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

