Breaking Newshome page sliderHome Page SliderTelangana

హైడ్రా కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.బతుకమ్మకుంట వివాదానికి సంబంధించి డిసెంబర్‌ 5వ తేదీ లోపు హైకోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది . హాజరు కాకపోతే నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయాల్సి వస్తుందని గురువారం హెచ్చరించింది. బతుకమ్మకుంటలోని ఒక ప్రైవేట్‌ స్థలంపై మార్పులు–చేర్పులు చేయవద్దంటూ హైకోర్టు జూన్‌ 12నే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను ధిక్కరించారని ఆరోపిస్తూ ఎడ్ల సుధాకర్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రైవేట్‌ స్థలంలో ఏ చర్యలు తీసుకోకుండా ఉండాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది . హైడ్రాకమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత హాజరును కూడా తప్పనిసరి చేసింది. గురువారం జరిగిన విచారణకు ఆయన హాజరుకాకపోవడంతో, హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది.