ఢిల్లీలో హై అలర్ట్..
దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ మొదలయ్యింది. 26-11 ముంబయి దాడుల కీలక నిందితుడు తహవూర్ రాణాను అమెరికా నుండి భారత్‌కు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. ఎన్‌ఐఏ అధికారులు రాణాను ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే అరెస్టు చేశారు. ఈ నిందితుడిని కారాగారాలలో బిర్యానీలు పెట్టి మేపవద్దని, తక్షణమే ఉరి శిక్ష విధించాలని సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధానిలో అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. ఎన్‌ఐఏ కోర్టుకు తరలించి, అప్పటి ఉగ్రదాడి కేసును విచారించనున్నారు. ఇటీవల భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ ఉగ్రవాదిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు.