సోషల్ మీడియా అకౌంట్లు దాచినా చాలు…వీసా రద్దు!
వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా అకౌంట్లు గోప్యంగా ఉంచితే, వారి వీసా దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో, డీఎస్-160 వీసా ఫారంలో గత ఐదు సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న యూజర్‌నేమ్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.వీసా దరఖాస్తులో ఇచ్చే సమాచారం పూర్తిగా నిజమైనదే అని అభ్యర్థి సంతకానికి ముందు ధృవీకరించాలి. లింక్డిన్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ ప్లాట్‌ఫామ్‌ల అకౌంట్లు తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఎఫ్,ఎం,జె వీసాలకు కొత్త నిబంధనలు ఇటీవల, ఎఫ్, ఎం, జె శ్రేణుల నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు సంబంధించి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకొనేవారు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్లను పబ్లిక్‌గా ఉంచాలని, తద్వారా అధికారులు వీరిపై వెట్టింగ్ నిర్వహించేందుకు వీలుగా ఉండాలని పేర్కొంది.ఈ వీసాలు సాధారణంగా విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్ విజిటర్లకు వర్తిస్తాయి.సోషల్ మీడియా వెట్టింగ్ కీలకం ఇదంతా వీసా మంజూరులో అభ్యర్థుల సోషల్ మీడియా కార్యకలాపాలు ఎంత ముఖ్యమో చాటుతోంది. వారి ఆన్‌లైన్ ప్రవర్తన ఆధారంగా వీసా మంజూరయ్యే అవకాశాలపై ప్రభావం చూపుతుంది. దీనినే “సోషల్ మీడియా వెట్టింగ్” అని పిలుస్తారు.ఈ విధానం డొనాల్డ్ ట్రంప్ పాలనలో ప్రారంభమై, ప్రస్తుతం మరింత కఠినంగా అమలవుతోంది. ప్రైవసీ సెట్టింగ్స్‌ను సవరించకపోతే, అభ్యర్థుల వీసా అవకాశం సున్నాకే పరిమితమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

