రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హీరోయిన్ సమంత
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రముఖ నటి సమంతా కలిసారు. ఈవిషయాన్ని ఫొటోలు షేర్ చేస్తూ ప్రకటించింది ఆమె నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ టీమ్. ఈ సిరీస్‌లో సమంతాతో పాటు వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం సెర్బియా పర్యటనలో ఉన్నారు రాష్ట్రపతి. అక్కడే షూటింగ్ జరుపుకుంటున్న సిటాడెల్ టీమ్ మర్యాదపూర్వకంగా ఆమెను కలిసారు. ఈ సందర్భంగా తనకు కామెడీ చిత్రాలంటే ఇష్టమని పేర్కొన్నారట ద్రౌపది ముర్ము. ఈ మధ్య సమంత నటించిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం అనుకున్నంత ఫలితాన్ని సాధించలేకపోయింది. అయినా నిరుత్సాహ పడకుండా వెంటనే తన తదుపరి ప్రాజెక్టు సిటాడెల్ షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొెంటున్నారు సమంత. ప్రస్తుతం తెలుగులో విజయదేవరకొండ హీరోగా ఖుషీ చిత్రాన్ని చేస్తున్నారు.