Home Page SliderTelangana

అగ్రదర్శకుడిపై హీరోయిన్ ఫైర్, చర్యలు తీసుకోలేదంటూ ఇండస్ట్రీ పెద్దలపై గుస్సా

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదును పరిష్కరించాలని నటి తెలుగు చిత్ర పరిశ్రమను మరోసారి కోరింది. టాప్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చర్చసాగుతోంది. ఇదే సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై గతంలో చేసిన ఫిర్యాదును పరిష్కరించాలని ప్రముఖ నటి పరిశ్రమ ప్రముఖులను కోరారు. మంగళవారం X లో ఆమె పోస్ట్‌ చేశారు. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలలో పనిచేసిన నటి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎలాంటి చర్య తీసుకోలేదంటూ నిరాశను వ్యక్తం చేసింది. తన ఫిర్యాదును ఆ రోజు సీరియస్‌గా తీసుకున్నట్లయితే, తనతోపాటు, మరికొందరు “రాజకీయ బాధలు” నుండి విముక్తి పొందేవారంది.

ఫిర్యాదు సమయంలో సినీ పరిశ్రమలోని అనేక మంది ప్రముఖులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందంది. అందరూ చూసీ చూడనట్టుగా వ్యవహరించారంది. ఇప్పుడు త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని ఇండస్ట్రీ పెద్దలకు ఆమె పిలుపునిచ్చారు. జవాబుదారీతనం కోసం నటి బహిరంగంగా పిలుపునిచ్చినప్పటికీ, త్రివిక్రమ్ గానీ, MAA ఆరోపణలపై ఇప్పటి వరకు స్పందించలేదు.

ఇక నటి ఫిర్యాదు చేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన చిత్రనిర్మాతలలో ఒకరు. రచయితగా కెరీర్ ప్రారంభించిన ఆయన గుంటూరు కారం, అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది, మన్మధుడు వంటి అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2000లో విడుదలైన నువ్వే కావాలి చిత్రానికి తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డు పొందింది. దక్షిణాదిలో ఇప్పుడు వేధింపుల అంశాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులకు సంబంధించి, ఆయా విభాగాలు జోక్యం చేసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.