Home Page SliderNational

నీట్ ఎగ్జామ్‌పై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా TVK పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర కల్లోలం సృష్టిస్తోన్న నీట్ ఎగ్జామ్‌పై హీరో విజయ్ స్పందించారు. కాగా విజయ్ నీట్ ఎగ్జామ్‌పై తన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ ఎగ్జామ్‌లో అక్రమాలు జరిగాయి కాబట్టి దేశానికి దాని అవసరం లేదన్నారు. ప్రజలు నీట్‌పై నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. కాగా తమిళనాడు ప్రభుత్వం నీట్  పరీక్షను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నానని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల ఎమోషన్లతో ఆడుకోవద్దని కేంద్రానికి విజయ్ విజ్ఞప్తి చేశారు. కాగా విద్యను ఉమ్మడి(కేంద్రం,రాష్ట్ర) జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి చేర్చాలని విజయ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.