Home Page SliderNational

ఇకపై రెండుసార్లు డిగ్రీలలో ప్రవేశాలు

డిగ్రీలు చేయాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఈ విద్యాసంవత్సరం నుండి ఉన్నతవిద్యాసంస్థలలో ప్రవేశాలను రెండుసార్లు నిర్వహిస్తామని యూజీసీ చీఫ్ జగదీశ్ కుమార్ తెలిపారు. ప్రతీ సంవత్సరం ఏటా జూలై- ఆగస్టులతో పాటు జనవరి- ఫిబ్రవరిలో కూడా ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. జూలైలో అడ్మిషన్లు తీసుకోలేనివారు జనవరిలో కూడా ప్రవేశం పొందవచ్చు. బోర్డు ఫలితాలలో ఆలస్యం జరగడం, రీవేల్యూయేషన్లు, సప్లిమెంటరీలు  వంటి కారణాలతో ఎవ్వరూ విద్యాసంవత్సరం నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే క్యాంపస్ ప్లేస్‌మెంట్లు తీసుకునే కంపెనీలు కూడా రెండుసార్లు ప్లేస్‌మెంట్లు నిర్వహిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.