Home Page SliderNational

కేదార్‌నాథ్‌లో భారీగా కురుస్తున్న హిమపాతం

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్రకు భారీగా కురుస్తున్న హిమపాతం అడ్డుకట్ట వేస్తోంది. ఉదయం వరకు బాగానే ఉన్న వాతావరణం ఈ రోజు 11 గంటల వేళ హఠాత్తుగా మబ్బులు కమ్మి మంచువర్షం కురవడం మొదలైంది. దీనితో మోకాల్లోతు మంచులో కూరుకుపోతున్నారు యాత్రికులు. అష్టకష్టాలు పడుతున్నారు. ఈ యాత్రకు దాదాపు 150 నుండి 200 మంది వరకు తెలుగు యాత్రికులు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ ప్రతికూల వాతావరణం వల్ల యాత్రను అర్థాంతరంగా నిలిపివేసింది ప్రభుత్వం. టూరిస్టులను అతికష్టం మీద రక్షిస్తున్నారు. కొందరిని మంచు కప్పేస్తుండడంతో మంచును తవ్వి వారిని కాపాడుతున్నారు. ఊహించని విధంగా వారిపై మంచు విరుచుకు పడింది. టూరిస్టులను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వయస్సు మళ్లినవారు ఎక్కువమంది రావడంతో వారికి ఆక్సిజన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. నడవలేని వారిని గుర్రాలపై తరలిస్తున్నారు.