ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!!
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ద్రోణి మరింత బలపడనుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ వంటి తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అలాగే మిగిలిన జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది . హైదరాబాదీలకు కీలకం … కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ను తలపించేలా కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్ని చెరువులను తలపించాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. సాయంత్రం – రాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అనుగుణంగా ప్రజలు తమ పనులను పూర్తి చేసుకోవాలని అలర్ట్ జారీ చేశారు.

