తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతువవనాలు చురుగ్గా కదులుతుండడంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు పడబోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల రెండు,మూడు రోజులలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గోదావరి జిల్లాలలో నిన్న కురిసిన భారీ వర్షానికి కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాలలో రోడ్లు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులు, వర్షాల వలన అనేక చెట్లు కూలిపోయాయి. హైదరాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తాంధ్రజిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ వర్షాల వలన సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.