Home Page SliderNational

ముంబైలో భారీ వర్షాలు.. రైళ్లు, విమానాలు బంద్..

భారీ వర్షాలతో ముంబై మహా నగరం తడిసిముద్దయింది. బుధవారం రోజున కురిసిన వర్షాలకు ముంబై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చే 14 విమానాలను దారి మళ్లించారు. పలు రైళ్లను రద్దు చేశారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. వరదల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందారు. మరో రెండు రోజులు ముంబైలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో ముంబై కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూళ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇండ్లనుంచి ఎవరూ బయటకు రావొద్దని ముంబై పోలీసులు సూచించారు. రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.